సీత కొరకై లంక తిరుగుతు
అశోకవనిలో అంత వెదకుతు
సీత నతడు చూచు వరకు
రాత్రి కొంచెమె మిగిలి యున్నది 1
తెల తెల వారు తుండగ
తొలి ఝాము గడుచుచుండగ
బ్రహ్మ రాక్షస గణము గళముల
వేద ఘోషలు హనుమ వినెను 2
సుస్వర శాంతి మంత్రములొకపక్క
వీనుల విందగు వాద్య ఘోషలొకపక్క
పరిచారికల అందెల అలజడులొకపక్క
వందిమాగధ సుప్రభాతములొకపక్క 3
విశ్రమించిన లంకకు చేతన అబ్బుచుండగ
సీత అందము మదిలో మెదలగ
ఆ తలపున నిద్దుర చెదరిపోగ
రావణుడప్పుడు లేచి నిల్చెను 4
సీత గురుతుకు వచ్చిన తడవు
మన్మధ తాపము బాగుగ రేగగ
అతని మగత కన్నులు ఎర్ర బారెను
క్రోధము ముఖము పై తాండవమాడెను 5
మెడన వాడిన మాలలు విడవలేదు
సంధ్యా వందనము గురుతేలేదు
సీతను కండ్లలొ నింపుకునసురుడు
అశోకవనికై వడి వడి నడచెను 6
పళ్ళతొ పూలతొ గంధపు చెట్లతొ
పక్షుల కూతలు నిండిన వనమున
నిద్రలొ తూలుతు అలసిన కళ్ళతో
సీతను చూడగ వడి వడి నడచెను 7
వందల వనితలు వెంటన రాగా
మంగళ వాద్యములన్నియు మ్రోగగ
అప్సర గణముల వెంటనిడుకుని
అవనిన నడిచెడి ఇంద్రుని లాగ 8
చెంచల హిరణులు చెంగున ఎగిరెడి
చల్లని ఏరులు జలజల పారెడి
అశోక వనమున అసురుల రేడు
అందరి నడుమ టీవిగ నడచె 910
కాంతులీనెడి దివ్వె కాడలు
నీరు నిండిన స్వర్ణ పాత్రలు
మణులు పొదిగిన విశిన కర్రలు
మధువు నిందిన వెండి పాత్రలు
చంద్ర కాంతులుజల్లు గొడుగులు
చేతనిడుకుని వివిధ వనితలు
మేఘునిననుశరించెడి మెరుపు లాగ
రాజ హంసల గుంపు లాగా
సొగసులొలుకుచు వెంట నడవగ
సీత చూడగ కోర్కె పెరగగ
వడిగ నడిచెను వారి రేడు 15
…
చెదిరిన కుంకము జారిన హారము
రేగిన పాపడ ఊడిన వలువలు
పొర్లిన సొగసులు దొర్లెడి నవ్వులు
సాగెడి తనువులు తడబడు నడకలు
పులిమిన గంధపు మోములు
నలిగిన పూలతొ వాడిన మేనులు
చెమటన తడిసి అలసిన ముఖములు
మదిర మత్తుతొ వాలెడి కన్నులు
కలిగిన వనితలు వెంటన నడవగ
సీతే పూర్తిగ మనసున నిండగ
కామము బుద్ధిని మరుగున పరచగ
వడి వడి నడచెను రావణుడచటకు 19
కాలి అందెల ఘల్లు ఘల్లు లను
సుస్వరమగు వాద్య ఘొషలను
సుందరాంగుల నడుమ ఠీవిగ
నడచి వచ్చెడి రావణాధము
చెట్టు కొమ్మపై కూర్చునుండి
సీతా మాతను భక్తి చూసెడి
పవన సుతుడగు వీర హనుమ
అశొక వనమున చేరుట చూసెను 21
సుగంధ తైలము పులిముట వలన
కాగడ వెలుగులొ బంగరు కాంతితొ
వెలిగెడి తనువుతొ మెరిసెడి మోముతొ
గాలికి ఎగిరెడి వస్త్రమునాపుచు
కదలిన ఆభరణముల సర్దుతు నడచే
కాముని వలె నగుపడు రావణుని
పువ్వుల ఆకుల నడుమన నక్కుచు
శ్రద్ధగ చూసెను మారుతి అప్పుడు 25
పక్షుల కిల కిల రవముల నడుమ
గాయకుల సరి గమ స్వరముల నడుమ
పరిచారికల పక పక నవ్వుల నడుమ
విలువగు ఆభరణ శోభితుడై
తారల మధ్యన చంద్రుని వలె వెలుగు
అతనినిచూసి క్రిందకి దుముకుచు
రావణుదితడని హనుమ పలికెను 30
నల్లని కురులు కన్నులు గల్గి
సన్నని లేత చేతులు గల్గిన
సీతను చూడగ దరికి చేరిన
రావణునప్పుడు ఆకుల వెనకగ
నక్కి దాగిన హనుమ చూసెను 32
Tuesday, April 22, 2008
Subscribe to:
Posts (Atom)